SBI PO Exam Pattern and Syllabus
ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా ఎస్‌బీఐ భర్తీ చేసే పోస్టుల సంఖ్య: 2000
కేటగిరీల వారీగా ఖాళీలు: జనరల్: 1010, ఓబీసీ: 540, ఎస్సీ: 300, ఎస్టీ: 150.
ఎంపిక విధానం
ఎంపిక విధానంలో మూడు దశలు
ఉంటాయి. అవి.. ఫేజ్ - 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ - 2 మెయిన్
ఎగ్జామినేషన్, ఫేజ్ - 3 గ్రూప్ ఎక్సర్‌సైజ్ - ఇంటర్వ్యూ.
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్
ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో
ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. సమాధానాలను గుర్తించడానికి గంట (60
నిమిషాలు) సమయం ఇస్తారు. ఈ పేపర్‌కు కేటాయించిన మొత్తం మార్కులు 100.
ఇందులో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. అవి..
విభాగం ప్రశ్నలు సమయం
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 20 నిమిషాలు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 20 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ 35 20 నిమిషాలు
మొత్తం 100 60 నిమిషాలు
ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన
మార్కుల ప్రకారం కేటగిరీల వారీగా మెరిట్ లిస్టును రూపొందిస్తారు. ఈ జాబితా
ఆధారంగా ప్రతి కేటగిరీలో ఖాళీలకు పది రెట్ల మందిని మెయిన్ పరీక్షకు ఎంపిక
చేస్తారు. అంటే దాదాపు 20 వేల మందికి మెయిన్‌కు హాజరయ్యే అవకాశం
లభిస్తుంది.
మెయిన్ ఎగ్జామినేషన్
ఈ పరీక్ష ఆబ్జెక్టివ్,
డిస్ర్కిప్టివ్ టెస్టులు కలయికగా ఉంటుంది. రెంటినీ ఆన్‌లైన్‌లోనే
నిర్వహిస్తారు. ఇందుకు మూడున్నర గంటల సమయం ఉంటుంది.
ఆబ్జెక్టివ్: ఈ
పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. సమాధానాలను గుర్తించడానికి మూడు గంటల సమయం
(180 నిమిషాలు) ఇస్తారు. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగానికి
నిర్దేశించిన సమయం ఉంటుంది. ఆ సమయంలోనే సదరు విభాగాన్ని పూర్తి చేయాలి.
ఆబ్జెక్టివ్ పరీక్షలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి..
విభాగం ప్రశ్నలు సమయం
రీజనింగ్ అండ్
కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 60 నిమిషాలు
డేటా అనాలిసిస్ అండ్
ఇంట్రప్రిటేషన్ 35 45 నిమిషాలు
జనరల్/ ఎకానమీ /
బ్యాంకింగ్ అవేర్‌నెస్ 40 35 నిమిషాలు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 40 నిమిషాలు
మొత్తం 155 180 నిమిషాలు
డిస్ర్కిప్టివ్ టెస్ట్: ఆబ్జెక్టివ్
టెస్ట్ తరవాత డిస్ర్కిప్టివ్ విభాగాన్ని కొనసాగిస్తారు. ఇందులో రెండు
ప్రశ్నలు ఉంటాయి. వీటికి అర్థ గంట (30 నిమిషాలు)లో సమాధానాలను రాయాల్సి
ఉంటుంది. అభ్యర్థుల ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు
డిస్ర్కిప్టివ్ విభాగాన్ని ఉద్దేశించారు. ఈ క్రమంలో అభ్యర్థులు ఆంగ్లంలో
ఒక లేఖ, ఒక వ్యాసం రాయాల్సి ఉంటుంది. రెంటికీ కలిపి 50 మార్కులు
కేటాయించారు. వీటికి సమాధానాలను కంప్యూటర్ మీద టైప్ చేయాలి. ఇందులో
అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత సాధించాలి.
రుణాత్మక మార్కులు
రుణాత్మక (నెగిటివ్) మార్కులు
కూడా ఉన్నాయి. ప్రిలిమినరీ, మెయిన్ ఆబ్జెక్టివ్ టెస్ట్‌లో ప్రతి తప్పు
సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. సమాధానం ఇవ్వని ప్రశ్నలకు ఎటువంటి
మార్కులు ఇవ్వరు.
గ్రూప్ ఎక్సర్‌సైజ్ - ఇంటర్వ్యూ
మెయిన్ ఎగ్జామ్‌లో వచ్చిన
మార్కుల ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. దీని
ప్రకారం ప్రతి కేటగిరీలో ఉన్న ఖాళీలకు మూడు రెట్ల మందిని మూడో దశ గ్రూప్
ఎక్సర్‌సైజ్ - ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇందులో గ్రూప్ ఎక్సర్‌సైజ్‌కు
20 మార్కులు, ఇంటర్వ్యూకి 30 మార్కులు కేటాయించారు. ఇంటర్వ్యూ సమయంలో
అభ్యర్థులు అర్హత, రిజర్వేషన్ కేటగిరీ సంబంధిత ధృవ పత్రాలను విధిగా
సమర్పించాలి.
తుది ఎంపిక ఇలా
ఫేజ్ - 2, ఫేజ్ - 3లలో చూపిన
ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉటుంది. ఫేజ్ - 1లోని ప్రిలిమినరీ ఎగ్జామ్
కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో సాధించిన
మార్కులను పరిగణనలోకి తీసుకోరు. ఫేజ్ - 2లోని మెయిన్ ఎగ్జామ్‌లోని
ఆబ్జెక్టివ్, డిస్ర్కిప్టివ్ టెస్ట్, ఫేజ్ - 3లోని గ్రూప్
ఎక్సర్‌సైజ్ - ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్
రూపొందిస్తారు. దీని ఆధారంగా పోస్టింగ్‌ను ఖరారు చేస్తారు. ఈ క్రమంలో
మెయిన్ ఎగ్జామ్‌లో అభ్యర్థులు సాధించిన మార్కులను 75 మార్కులకు, గ్రూప్
ఎక్సర్‌సైజ్ - ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను 25 మార్కులకు లెక్కిస్తారు.
అంటే మొత్తం 100 మార్కులకు అభ్యర్థుల ప్రతిభను గణిస్తారు.
ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్
ఎస్సీ / ఎస్టీ / మైనార్టీ
అభ్యర్థులకు ఎస్‌బీఐ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. సదరు
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తున్నప్పుడు ఆ సదుపాయం కోసం అభ్యర్థన
కనిపిస్తుంది. దానికి సమ్మతి తెలపడం ద్వారా ఈ అవకాశాన్ని
వినియోగించుకోవచ్చు. తెలుగు రాష్ర్టాల అభ్యర్థుల కోసం హైదరాబాద్, తిరుపతి,
విశాఖపట్నం, విజయవాడలలో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు
చేశారు.
ప్రిపరేషన్
జనరల్ ఇంగ్లిష్: అత్యంత
కీలక విభాగం. తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం విభాగం కూడా.
మొత్మమీద ఈ సబ్జెక్ట్‌కు 100 మార్కులు కేటాయించారు. కాబట్టి దీని పాత్ర
నిర్ణయాత్మకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనిస్తూ ప్రిపరేషన్‌లో అధిక
ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో ఎర్రర్ స్పాటింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్,
ఒకాబులరీ, స్పెల్లింగ్, బేసిక్ గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్,
ఫ్రేజెస్, యాంటినమ్స్ - సినానిమ్స్, కాంప్రెహెన్షన్ తదితర అశాల నుంచి
ప్రశ్నలు వస్తాయి. బేసిక్ గ్రామర్ అంశాలపై దృష్టిసారిస్తే ఇందులో మెరుగైన
స్కోర్ సాధించవచ్చు. డిస్ర్కిప్టివ్‌లో ఇంగ్లీష్‌లోనే సమాధానాలను రాయాలి.
ప్రతి రోజూ ఏదైనా ఒక ఇంగ్లీష్ దిన పత్రికను చదవడం ద్వారా గ్రామర్,
డిస్ర్కిప్టివ్, జనరల్ / ఎకానమీ / బ్యాంకింగ్ అవేర్‌నెస్ అంశాలకు కూడా
ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కనీసం రోజుకు ఇంగ్లీష్‌లో ఒక వ్యాసాన్ని రాయటం
ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఈ
విభాగాన్ని అభ్యర్థులు క్లిష్టమైనదిగా భావిస్తారు. ఇందులో భిన్నాలు,
దశాంశాలు, శాతాలు, లాభ - నష్టాలు, నిష్పత్తి, డిస్కౌంట్,
పార్ట్‌నర్‌షిప్, వ్యాపార గణితం (వడ్డీ), కాలం - దూరం, కాలం - పని,
గ్రాఫ్స్, త్రిభుజాలు, సర్కిల్స్, స్తూపాలు, చతురస్రం, ధీర్ఘచతురస్రం,
పిరమిడ్, ఎత్తు - దూరం, కోణాలు, బార్ - చార్ట్ డయాగ్రామ్ వంటి అంశాల
నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగంలో ఎక్కువ స్కోరింగ్ చేయాలంటే టేబుల్స్,
స్వేర్స్, క్యూబ్స్, స్వేర్ రూట్స్‌పై అవగాహన చేసుకోవాలి. తద్వారా
కాలిక్యులేషన్స్‌ను చేయడం సులభమవుతుంది. అదే విధంగా టాపిక్స్‌కు సంబంధించిన
ఫార్ములాలను గుర్తు పెట్టుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు షార్ట్‌కట్
మెథడ్స్‌ను ఉపయోగించడం నేర్చుకోవాలి. తద్వారా సమాధానాన్ని గుర్తించడంలో
వేగం, కచ్చితత్వం అలవడతాయి.
రీజనింగ్: అభ్యర్థుల
తార్కిక శక్తిని పరీక్షించే విభాగం. ముఖ్యంగా సందర్భానుసారం సమయస్ఫూర్తిగా
ఎలా వ్యవహరిస్తారో తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అనాలజీ,
ప్రాబ్లమ్ సాల్వింగ్, బ్లడ్ రిలేషన్స్, రీజనింగ్, అర్థమెటిక్,
నెంబర్ సిరీస్, కోడింగ్ - డికోడింగ్, డేటా సఫిషియెన్సీ, డైరెక్షన్
సెన్స్, ర్యాంకింగ్స్, సీట్ అరేంజ్‌మెంట్స్, వర్డ్ బిల్డింగ్, వెన్
డయాగ్రమ్స్, స్పేస్ విజువలైజేషన్, మ్యాచింగ్ వంటి టాపిక్స్‌పై దృష్టి
సారించాలి. ఈ విభాగం కోసం బేసిక్ మేథమెటిక్స్, అల్ఫాబెట్ టెస్ట్
అంశాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రిపరేషన్‌లో ఒక టాపిక్‌ను
తీసుకుంటే..దానికి సంబంధించి ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో
ముందే ఊహించుకొని ప్రాక్టీస్ చేయాలి. ఈ విభాగంలో ఎక్కువ స్కోర్ చేయాలంటే
వేగంతోపాటు కచ్చితత్వం కూడా అవసరం. కాబట్టి సమయాన్ని నిర్దేశించుకొని
ప్రొబ్లమ్స్‌ను సాల్వ్ చేయడం నేర్చుకోవాలి.
కంప్యూటర్ ఆప్టిట్యూడ్: ఇందులో
కంప్యూటర్ ఫండమెంటల్స్, ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్,
కీబోర్డ్ షాట్‌కట్స్, నెట్‌వర్క్, ఆపరేటింగ్ సిస్టమ్ వంటి అంశాల నుంచి
ప్రశ్నలు వస్తాయి.
డేటా అనాలిసిస్ అండ్ ఇంట్రప్రిటేషన్: ఈ
విభాగం కోసం ఆర్థమెటిక్, మేథమెటిక్స్‌లోని ప్రాథమిక భావనలపై పట్టు
పెంచుకోవాలి. తద్వారా డేటాను విశ్లేషించడం సులభమవుతుంది. టేబుల్స్,
స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్ రూట్స్ తదితరాలపై అవగాహన చేసుకోవాలి.
ఇందులో టేబుల్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, పై చార్ట్, మిస్సింగ్ కేస్,
ప్రొబబిలిటీ, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్ / ఎకానమీ / బ్యాంకింగ్ అవేర్‌నెస్: జనరల్
అవేర్‌నెస్/ఎకానమీ కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చోటు చేసుకుంటున్న
పరిణామాలను నిశితంగా గమనించాలి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆర్థిక రంగం,
ఎస్‌బీఐ పరిణామాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. పరీక్ష తేదీకి ముందు ఆరు
నుంచి ఎనిమిది నెలల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
మార్కెటింగ్ విభాగంలో నూతన విధానాలు, ట్యాగ్ లైన్స్‌ను తెలుసుకోవాలి.
ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్: ఇందులో
కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్
స్కిల్స్‌ను పరీక్షిస్తారు. కాబట్టి ఆయా అంశాలను మెరుగుపరుచుకోవాలి.
గ్రూప్ ఎక్సైజ్‌లో భారతీయ బ్యాంకింగ్ రంగం, ఆర్థిక రంగం, జాతీయ
ప్రాముఖ్యత ఉన్న అంశాలను అడగొచ్చు.
కీలకం ప్రిలిమ్స్
మూడు దశలుగా ఉండే పరీక్షల్లో
కీలకమైంది ప్రిలిమ్స్. ఎందుకంటే లక్షల మంది నుంచి వేల మందికి మాత్రమే
మెయిన్‌కు అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రిలిమ్స్‌లో సాధ్యమైనంత వరకు
ఎక్కువ మార్కులు సాధించేందుకు ప్రయత్నించాలి. గత కటాఫ్‌లను పరిశీలిస్తూ
దాని కంటే ఎక్కువ మార్కులు సాధించేలా కృషి చేయాలి. వీలైనన్ని మాక్
టెస్ట్‌లు రాయాలి.
కెరీర్, వేతనం
ఎంపికైన అభ్యర్థులకు
బ్యాంకింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అవగాహన కోసం ఆన్‌లైన్ కోర్సును
నిర్వహిస్తారు. అభ్యర్థులు నిర్దేశించిన విధంగా ఈ కోర్సును పూర్తి చేయాల్సి
ఉంటుంది. తరవాత రెండేళ్ల పాటు ప్రొబేషన్‌లో ప్రొబేషన్ ఆఫీసర్‌గా విధులు
నిర్వహించాలి. ప్రొబేషన్ విజయవంతంగా పూర్తి చేస్తే అటుపై జూనియర్
మేనేజ్‌మెంట్ గ్రేడ్ - 1 స్కేల్ హోదాతో కెరీర్ ప్రారంభమవుతుంది.
బ్యాంకులో మూడేళ్ల పాటు విధులు నిర్వహిస్తామని రూ. రెండు లక్షల బాండ్
సమర్పించాలి. ప్రస్తుతం పీఓగా చేరిన వారికి సంవత్సరానికి 8.20 లక్షల నుంచి
రూ. 13.08 లక్షల మధ్యలో వేతనం లభిస్తుంది. పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతాన్ని
బట్టి వేతనంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనికి తోడు తక్కువ వడ్డీతో రుణం,
మెడికల్ అలవెన్సులు వంటివి అదనంగా ఉంటాయి. ప్రొబేషనరీ ఆఫీసర్ తరవాత
ప్రతిభ ఆధారంగా మరిన్ని ఉన్నత అవకాశాలను అందుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ
రంగ బ్యాంకుల్లో అత్యున్నత హోదాల్లో ఉన్న వారు ప్రొబేషనరీ ఆఫీసర్‌గానే తమ
కెరీర్‌ను ప్రారంభించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇందుకు చక్కని ఉదాహరణ
ఎస్‌బీఐ మాజీ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య. ఈమె 1977లో ఎస్‌బీఐలో పీఓగా
చేరారు. తన ప్రతిభ ఆధారంగా ఎస్‌బీఐ చైర్మన్ స్థాయికి ఎదిగారు. 2013 - 2017
వరకు ఈ బాధ్యతలు నిర్వహించారు.
for more details and to apply for this click here...........
Comments
Post a Comment